పద్మశాలి మహిళా విభాగం కమిటీ ఎన్నిక.   - అధ్యక్షురాలుగా  ఊర్కొండ రమాదేవి, 

పద్మశాలి మహిళా విభాగం కమిటీ ఎన్నిక.   - అధ్యక్షురాలుగా  ఊర్కొండ రమాదేవి, 

విశ్వంభర, ఎల్బీనగర్ :-  పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్  ఆధ్వర్యంలో మహిళా విభాగం కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. మన్సూరాబాద్ లోని పాలాది పరమేశ్వర్ వృద్ధాశ్రమంలో   పున్న గణేష్ అధ్యక్షతన తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగ ప్రెసిడెంట్ గుంటక రూప సదాశివ్ , గ్రేటర్ హైద్రాబాద్ ప్రెసిడెంట్ పోరండ్ల శారదా ముఖ్య అతిధులుగా పాల్గొని మహిళా అధ్యక్షురాలుగా  ఊర్కొండ రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా  పేరాల సుజాత,  మహిళ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా అఖిల భారత పద్మశాలి అన్నసత్రాల మార్గ దర్శకులు చిలువేరు కాశీనాథ్ , బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం , పద్మశ్రీ గజం అంజయ్య , వేముల రాము నేత , రాపోలు సుధాకర్ నేత సమక్షములో కార్యక్రమం నిర్వహించారు. మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన  ఊర్కొండ రమాదేవి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి , సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఎల్బీనగర్ విభాగంలో మహిళ కమిటీని వేసి సంఘ అభివృద్ధిలో మాకంటూ ఒక గుర్తింపు వచ్చేలా చేసిన ఎల్బీనగర్ సంఘం కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎన్నికైన మహిళా కమిటీకి పలువురు శాలువాలతో సన్మానించారు.

Tags: