ఎన్నారై నవీన్ దాతృత్వం: స్టూడెంట్స్ కు బ్యాగుల వితరణ
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని రాము తండా కు చెందిన గుగులోతు శ్రీనివాస్ నాగమ్మ దంపతుల కుమారుడు ఎన్నారై గుగులోతు నవీన్(చింటూ) రాము తండా యుపిఎస్, వీరారెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రు.12,500 విలువ గల స్కూల్ బ్యాగులను వితరణ చేశారు. మండల విద్యాశాఖాధికారి వెన్న వెంకటరెడ్డి, సర్పంచి మీటు నాయక్ ల చేతుల మీదుగా బుధవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలబాలికలకు ఎంతో ఉదారతతో నవీన్ కూల్ బ్యాగులను బహుకరించడం అభినందనీయమన్నారు. ఎక్కువగా పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ లలో చదువుతున్నారని బ్యాగులు అందజేయడం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. దాతలు దాతృత్వం కనపరిచి ప్రోత్సహించడంతో సర్కార్బడులలో హాజరు శాతం మరింత పెరుగుతుందన్నారు. నవీన్ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సహకారం అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలోబానోతు రామన్న ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.