అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క 

ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.

ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధిర అభివృద్ధిపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలో నెంబర్ వన్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. మధిరలో అండర్ డ్రైనేజీల నిర్మాణానికి రూ.128 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 

అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద, యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్నునొప్పి వంటి ఖరీదైన వ్యాధుల చికిత్సలు, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం ఉన్న పథకాలకు సంబంధించి నూతన చికిత్సా విధానాలు, ఆర్థిక సవరణల కోసం రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్కతో సమావేశం జరిగింది.2007లో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద 2.84 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఈ పథకం ద్వారా వారికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. రాష్ట్రంలోని 1402 ఆసుపత్రుల ద్వారా ఈ సదుపాయం కల్పించబడింది.

Read More అంతర్ జిల్లా వాహనాల దొంగ అరెస్ట్

ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వైద్య నిపుణుల సూచనల మేరకు 1375 ప్రొసీజర్లకు ప్యాకేజీ ధరలను పెంచుతూ డిప్యూటీ సీఎం నిర్ణయించారు. యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్ సన్, వెన్నుపూసలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో అమలు చేయని 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్‌లో ఉన్న 98 చికిత్సా విధానాలను రాజు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 189.83 కోట్లు ఖర్చు, 65 కొత్త చికిత్సలను అంగీకరించడం వల్ల ప్రభుత్వం 158.20 కోట్లు ఖర్చు,  చేస్తుంది.

🕒 09 Jun 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535