జడల రామలింగేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎంపీ చామల 

జడల రామలింగేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎంపీ చామల 

 


విశ్వంభర, నార్కెట్ పల్లి: తెలంగాణా శ్రీశైలం గా పేరు గాంచిన నార్కెట్ పల్లి మండలం లోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భం గా  ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలి అని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బత్తుల ఉషయ్య గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నేతగాని కృష్ణ, మాజి జడ్పీటీసీ దూదిమెట్ల సతయ్య యాదవ్, సట్టు సతయ్య, ప్రజ్ఞపురం సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.

Read More అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం

Tags: