ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అలాగే మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం జనంపల్లి, ఇస్కిల్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భూక్యా నాయక్, వైస్ చైర్మన్ సింగిరెడ్డి మల్లారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు



