ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పోల్ అయిన ఓట్లలో ఎక్కువ శాతం చెల్లని ఓట్లు వస్తుండటం అధికారులకు తలనొప్పిగా మారింది.

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పోల్ అయిన ఓట్లలో ఎక్కువ శాతం చెల్లని ఓట్లు వస్తుండటం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం నెలకొంది. 

ఆ క్రమంలోనే కౌంటింగ్కు ఆలస్యమవుతోంది. పట్టభద్రులై ఉండి అవగాహన రాహిత్యంతో ఓటు వేయడం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా చెల్లని ఓట్లలో ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓట్లపై ‘జై జై మల్లన్న’ ‘ఐ లవ్ యూ మల్లన్న’ అంటూ కొందరు.. బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు రాశారు మరికొందరు. 

Read More రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు గాంధీజీ విద్యార్థులు ఎంపిక

రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి తీన్మార్ మల్లన్నకు 70,785ఓట్లు పోల్ అయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 23,236, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 20,037 పోలయ్యాయి. ఇప్పటి వరకు 15,126 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. చెల్లిన ఓట్లు 1,77,151 అని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ప్రస్తుతం 14,672ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.