కెప్టెన్ లక్ష్మి సెహగల్ ఆశయాలతో యువత ముందుకు సాగాలి: మల్లు లక్ష్మి
- కెప్టెన్ లక్ష్మి సెహగల్‌కు ఘన నివాళులు.. ఐద్వా ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం
- ప్రజాస్వామ్య, సమానత్వ విలువల పరిరక్షణలో యువత పాత్ర కీలకం: ఐద్వా
Captain Lakshmi Sehgal: స్వాతంత్ర్య సమరయోధురాలు కెప్టెన్ లక్ష్మి సెహగల్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఆమె 14వ వర్ధంతి సందర్భంగా బాగ్‌లింగంపల్లిలో ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఐద్వా ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధురాలు కెప్టెన్ లక్ష్మి సెహగల్ 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి అధ్యక్షత వహించగా, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.ఎన్. ఆశలత కెప్టెన్ లక్ష్మి సెహగల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపుతో 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరిన కెప్టెన్ లక్ష్మి సెహగల్ ఝాన్సీ రాణి రెజిమెంట్‌కు నాయకత్వం వహించి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విశేష సేవలందించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం మహిళల హక్కులు, సమానత్వం, కార్మికులు, రైతులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడుతూ ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ విలువలను పరిరక్షించడంలో యువత ముందుండాలని, కెప్టెన్ లక్ష్మి సెహగల్ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ, ఇందిర, కవిత, రెష్మ, వెంకటమ్మ, ఎల్లమ్మతో పాటు పలువురు ఐద్వా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.