టెక్ మహీంద్రా కార్యాలయం ముందు మహిళా ఉద్యోగి ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్

  • టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట మహిళా ఉద్యోగి భావన ధర్నా.
  • సెలవు కోరిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఆరోపణ.
  • ఉద్యోగులపై అనవసర ఒత్తిడి తెస్తున్నారని యాజమాన్యంపై విమర్శలు.

Hyderabad News: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహదూర్‌పల్లిలో ఉన్న టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భావన ధర్నాకు దిగారు. తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో మూడు రోజుల సెలవు కావాలని ముందుగానే యాజమాన్యానికి సమాచారం ఇచ్చి అనుమతి కోరినప్పటికీ, అనంతరం తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిందని ఆమె ఆరోపించారు. అలాగే యాజమాన్యం ఉద్యోగులపై అనవసర ఒత్తిడి తెస్తోందని, వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, అనారోగ్యంతో ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపిన భావన, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తనపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టెక్ మహీంద్రా కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ ఆరోపణలపై కంపెనీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/female-employee-dharna-in-front-of-tech-mahindra-office/article-19507

Related Posts