ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
On
విశ్వంభర, ఉప్పుగూడ : ఛత్రినాక శివగంగా నగర్ లోని లక్ష్మనేశ్వరాలయంలోని గోశాలలో శ్రీకృష్ణునికి ఆలయ కమిటీ సభ్యులు కుటుంబాల సమేతంగా పూజ నిర్వహించారు. అనంతరం గోవుకు గో గ్రాసం, గుగ్గిళ్ళు, బెల్లం, పలు రకాలైన పళ్ళు తో కూడిన పదార్థాలు మరియు చీరలు సమర్పించి పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణునికి కొలువైన రూపం గోవు అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చైర్మన్ మా రెడ్డి దామోదర్ రెడ్డి , ప్రెసిడెంట్ మానేపల్లి మధు, ట్రెజరర్ దుడుగుల వెంకటేష్, జనరల్ సెక్రెటరీ ఎస్ సత్యనారాయణ, అడ్వైజర్ వర్కాల యాదయ్య, రాజు యాదవ్, కృష్ణమాచారి, మరియు కుటుంబ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు



