మన స్వయంపాలన దేశానికే ఆదర్శం: కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేళ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధనకు సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేళ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధనకు సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ధి వేడుకలను ముగించుకునే సందర్భంలో అమరులకు నివాళులర్పిద్దామన్నారు.
ప్రజాస్వామిక వాతావరణంలో పార్లమెంటరీ పంథాలో బీఆర్‌ఎస్ పార్టీ అస్థిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. రాష్ట్ర సాధనకు భావజాలవ్యాప్తి సాగించి తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సకలజనులకు బోధించి, పోరాటంలో సబ్బండ వర్గాలను సమీకరించి అనేక వ్యూహాలను, ఎత్తుగడలను అమలుపరిచి కేంద్రాన్ని కదిలించామని పేర్కొన్నారు.
అనేక త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో పటిష్ట పరుచుకుంటూ సమర్థవంతంగా పాలనను అం దించిన పదేండ్ల స్వయంపాలనాకాలం దేశానికి అభివృద్ధి, సంక్షే మ రంగాల్లో తెలంగాణను ఒక రోల్ మోడల్‌గా నిలిపిందని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను వృథా పోనీయకుండా ప్రజల భాగస్వామంతో సాధించిన ప్రగతిని, ప్రజాసంక్షేమాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.