కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యాలి

రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని హైదరాబాద్ బంజారా హిల్స్ లో అయన ఇంటి వద్ద  కలిసి విజ్ఞప్తి చేసిన  తెలంగాణా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్

WhatsApp Image 2024-07-20 at 15.24.56_9765bbf6

విశ్వంభర జులై 20 : - తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మరియు బీసీ ప్రతినిధుల బృందం కలిసి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యాలని కోరారు, గత ప్రభుత్వం ఒంటెద్దు పోకడల విధానాల వలన బీసీలు స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యాన్ని భారీగా నష్టపోయారని మంత్రికి గుర్తు చేసారు,
కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మెనీ ఫెస్టో లో బీసీల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ గారి అభిష్టం మేరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగనణ జరిపించి బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్స్ & సివిల్స్ కన్స్ట్రక్షన్ లో మరియు మెంటేనేన్స్ లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరు తో దేశం గర్వించదగ్గ సీనియర్ బీసీ నాయకులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారమయ్య గారి చేతులమీదుగా  విడుదల చేసారు, కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రతిష్టంగా అమలు పరచాలని, తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలగనణ మొదలు పెట్టాలని కులగనణ పూర్తి అయినా తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  స్పందిస్తూ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ  ల అభ్యున్నతి కోసం పాటుపడతామని మంత్రి హామీ ఇచ్చారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ తెలిపారు  ఈ కార్యక్రమం లో నగిరి ప్రవీణ్ కుమార్ పటేల్ ఓయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్, ఎర్ర శ్రీహరి గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గిరగాని బిక్షపతి గౌడ్ రాష్ట్ర కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం, పెంట అజయ్ పటేల్ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు, సాయి కిరణ్, శ్రీనాథ్, నిమ్మల శ్రీనివాస్, కాటం రాజు యాదవ్, ప్రశాంత్, రాజేష్,బీసీ యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు,

Read More మానవత్వం చాటిన మాజీ ఎంపీపీ