మార్వాడి గోబ్యాక్ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గా కురుపాటి సుదర్శన్
On
విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ ఉద్యమం తర్వాత అంతటి మహోత్తర ఉద్యమం మార్వాడి గోబ్యాక్ మూమెంట్ ఆ ఉద్యమాన్ని బుజాన వేసుకున్న యస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కుల, ప్రజా సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా చండూర్ డివిజన్ తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కురుపాటి సుదర్శన్ ను తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. కురుపాటి సుదర్శన్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నన్ను గమనించిన రవి విద్యార్థి ఉద్యమంలోకి తీసుకోవడం, రాష్ట్రం రాగానే మా రాష్ట్రంలో మా వాటా అనే నినాదంతో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగిస్తూ ఆ ఉద్యమంలో నన్ను నల్గొండ జిల్లా అధ్యక్షునిగా నియమించడం రిజర్వేషన్లు రాగానే తెలంగాణ రాష్ట్రాన్ని మార్వాడీలు పీడిస్తున్న విధానాన్ని పసిగట్టి మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని రచించి ఆ ఉద్యమంలో నన్ను కూడా క్రియాశీలక పాత్ర పోషించే విధంగా తోడ్పాటు చేస్తూ రాష్ట్ర వైస్ చైర్మన్ గా నియమించిన పిడమర్తి రవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు భవిష్యత్తులో కూడా చేయనని తెలియజేస్తు మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో నా వంతు క్రియాశీలక పాత్ర పోషిస్తానని తెలియజేశారు.



