ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్

WhatsApp Image 2024-07-22 at 14.20.43_feb21642

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు(ఎం) పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకు ఐలయ్య  సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో ఎస్డీఎఫ్  నిధుల నుండి పనులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
 
 వినతి పత్రంలోని అంశాలు 
---------------------------------------
 
1.ఆత్మకూర్ మెయిన్ రోడ్డు నుండి శివాలయం వరకు సెంటర్ లైటింగ్,డబుల్ రోడ్డు నిర్మాణం
 
2.నాయిబ్రహ్మణులకు(మంగలి) కమ్యూనిటీ భవనం నిర్మాణం. 
 
3.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్డు నుండి వయా పెట్రోల్ బంక్ నుండి బొంత అంజయ్య ఇంటి వరకూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం.
 
4.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్ నుండి వయా పెద్దమ్మ తల్లి గుడి నుండి బస్ స్టాండ్ నుండి సబ్ - స్టేషన్ వరకు బీటి రోడ్డు నిర్మాణం.
 
5.మార్కెట్ యార్డు నుండి కామునిగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం .
 
6.నల్ల నర్సయ్య ఇంటి నుండి వనం భారతమ్మ ఇంటి వరకూ సీసీ రోడ్డు నిర్మాణం.
 
7.కొండపల్లి ముత్యాలు ఇంటి నుండి రజక( సాకలి) వాడ వరకు సీసీ రోడ్డు నిర్మాణం.
 
8.పిన్నింటి మోహన్ రెడ్డి ఇంటి నుండి ఎలిమినేటి యాదయ్య, పెద్దమ్మ గుడి వరకు  సీసీ రోడ్డు నిర్మాణం.
 
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాస లక్ష్మారెడ్డి,పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు పోతగాని మల్లేష్, పట్టణ బీసీ సెల్ అద్యక్షులు ఎలగందుల శ్రీనివాస్,ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్,ఎలగంధుల సాయి తదితరులు పాల్గొన్నారు.

 

Read More మాస్టర్ కారింగు రవికి ఘనంగా సన్మానం