జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ

జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ

విశ్వంభర, రాజన్న బావి :-  దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జై భవాని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ శివాజీ నగర్,రాజన్న బావి.  ఆధ్వర్యంలో అన్నదానo నిర్వహించారు. అధ్యక్షుడు పి నరేందర్ మాట్లాడుతూ 1996 నుండి వినాయక ప్రతిమ నెలకొల్పుతున్నామని 1998 నుండి అమ్మవారి ప్రతిమ నెలకొల్పుతున్నామని ఎన్ని అవరోధాలు వచ్చినా బస్తి వాసుల సహాయ సహకారంతో అన్ని కార్యక్రమాలని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని తెలుపుకొచ్చారు.  మా దగ్గర అమ్మవారికి నిత్య పూజలు, దాండియా, బతుకమ్మ సంబరాలు ప్రతినిత్యం బస్తీ వాసులంతా కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు. మా ప్రత్యేకత మాలలు ధరించిన మాలదారులకు ప్రతి రోజు రాత్రి అన్నదానం చేస్తామని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అమ్మ తోడు ఉండడం వల్ల నిర్విరామంగా సాగుతుందని మాకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. వైస్ ప్రెసిడెంట్ జి జగదీష్, సి శేఖర్, శ్రీనివాస్ N, దేవా, కే రాజేష్, జీ వినయ్ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని తెలిపారు.

Tags: