ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం
On
విశ్వంభర, హైద్రాబాద్ : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్రను ఖైరతాబాద్ మహా గణేష్ ఉత్సవ కమిటీ ప్రముఖులు కలిశారు. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ సమీపాన గత 50ఏండ్లకు పైగా వినాయకుడి భారీ విగ్రహాన్ని నెలకొల్పి నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. వినాయక నవ రాత్రోత్సవాల సందర్భంగా మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయాల్సిందిగా కోరుతూ ఉత్సవ కమిటీ ప్రముఖులు సోమవారం రాత్రి ఎంపీ రవిచంద్రను ఆహ్వానించారు.
ఎంపీ వద్దిరాజును శాలువాతో సత్కరించి ఆహ్వానం పత్రం అందజేసిన వారిలో విష్ణు పటేల్,రాజకుమార్,నరేందర్, నర్సింగ్, మహేష్, కార్తీక్,వెంకట్ గౌడ్ తదితరులు ఉన్నారు