మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ కు సన్మానం
On
విశ్వంభర, వనస్థలిపురం : వైదేహినగర్ రోడ్ నెంబర్ 3లోని మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆఫీసులో సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలుకు ఆకర్షితులై సామాజిక సేవ కార్యకర్త మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకరయ్యను శాలువాతో సుధాకర్ ఘన సన్మానం చేసారు. ప్రాణం పోతున్న సమయంలో ఆ ప్రాణాన్ని కాపాడుతున్న నిజమైన సేవకులు అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు ఉపయోగపడుతున్నందుకు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసి గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్, సిహెచ్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.