మైనార్టీ ప్రజాప్రతినిధులకు సన్మానం
On
విశ్వంభర,సూర్యాపేట: ప్రజా సేవలో నిమగ్నమైన నాయకులను గౌరవించుకోవడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ సెంటర్ మస్జిద్-ఏ-అక్సా ఆవరణలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ షఫీ ఉల్లాతో పాటు 38వ వార్డు కౌన్సిలర్ గండూరి రమేష్, కౌన్సిలర్లు సయ్యద్ తన్వీర్ హుస్సేన్, షేక్ ఫారుక్, తాహిర్ భాయ్, జహీర్ భాయ్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజాద్ అలీ లను మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్ నూర్ ఫౌండేషన్ ప్రతినిధి మహమ్మద్ ఈద్రిస్ తోడ్పాటుతో 160 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు మౌలానా ముఫ్తీ అత్తర్ మజాహరి, హఫీజ్ ఖలీల్, గాయసుద్దీన్, ఆవాజ్ కార్యదర్శి షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.



