ఉన్నత విద్య,  ఆరోగ్యశ్రీ,  రుణమాఫీ వైఎస్సార్ ఘనత

  •  చిన్న నాగారంలో ఘనంగా రాజశేఖర్ రెడ్డి జయంతి  

విశ్వంభర, ఇనుగుర్తి: బీటెక్ వంటి ఉన్నత విద్య కు ఫీజు రీయింబర్స్మెంట్, ప్రజారోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప జనహృదయ నేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య, డిసిసి ఉపాధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ ప్రభృతులు అన్నారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో వైఎస్సార్ 77వ,జన్మదిన వేడుకలను బుధవారం కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కేకు కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించారు. అంతకమునుపు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని మహానేత రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే సంకల్పం కలిగిన ప్రజానేత అని కొనియాడారు. ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు భూక్య చిన్ని వెంకన్న,భూక్య లక్ష్మి వెంకన్న, ఉపసర్పంచి తుమ్మనపల్లి సతీష్ చారి, వార్డు సభ్యులు బైరు వెంకటేశ్వర్లు,నిడిగంటి చంద్రమౌళి, ముత్యాల సోమక్క, మునిగంటి శ్రీలత రాజు చారి, చెడుపాక అలివేలు వెంకన్న,గుండాల మంగమ్మ ధర్మయ్య, జీవన్,ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము,నాయకులు కూరెల్లి సతీష్,కదిరె జగన్ గౌడ్,కొయ్యడి యాకాంతం గౌడ్, బైరు శ్రీనివాస్,దాసరి ప్రకాష్,గంజి రాజేందర్ రెడ్డి, శివాజీ, బైరు వెంకటయ్య,ఉడుతకుమురుమల్లు,పోలోజు సోమయ్య,బైరు వేణు, చెడుపాక దర్గయ్య,శేఖర్, బైరు వెంకన్న,చెడుపాక జంపయ్య,చెడుపాక రవి పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/higher-education-arogyasree-loan-waiver-ysr-merit/article-18298

Tags: