కేంద్రమంత్రులకు విందు ఇచ్చిన గవర్నర్ దత్తాత్రేయ
On
న్యూ ఢిల్లీ,విశ్వంభర;జూన్ 27:- నరేంద్ర మోడీ క్యాబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుండి నూతనంగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ,కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలను హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ న్యూఢిల్లీలోని హరియాణా భవన్ లో విందుకు ఆహ్వానించి ఘనంగా సత్కరించడం జరిగింది.తెలుగు రాష్ట్రాల నుండి కేంద్రమంత్రులుగా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాల సంతోషంగా ఉందని ఇది తెలుగు వాళ్ళకే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు.తెలుగు వారు అయినా హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ మమ్ముల్ని విందుకు ఆహ్వానించి సత్కరించడం గొప్ప విషయమని మంత్రులు తెలిపారు.