కందుకూరులో బిజెపి ఆవిర్భావ దినోత్సవం
విశ్వంభర, మహేశ్వరం : కందుకూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి కందుకూరు మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి చౌరస్తాలో పార్టీ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ స్థాపించి 48 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందని పార్టీ వ్యవస్థాపకులు పండిత్ దీన దయాలజీ శ్యాం ప్రకాష్ ముఖర్జీ వాజ్పేయి లాంటి పెద్దలు ఆశయాలు ఎన్నో నెరవేశాయని అన్నారు, పార్టీ ఎందుకైతే స్థాపించబడిందో ఆ ఆశలు నెరవేర్చిందని అన్నారు రాబోయే 40 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఏ భారతదేశంలో అధికారంలో ఉంటుందని అన్నారు, పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ నియమాలు పాటించి భారతదేశంలో పార్టీని స్థిరస్థాయిగా నిలుపుకొని పెద్దల కోరిక నెరవేర్చాలని అన్నారు, ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు పల్లె కృష్ణ గౌడ్, జిల్లా నాయకులు జిట్టా రాజేందర్ రెడ్డి, నల్లబోలు నరసింహారెడ్డి, ఎగ్గిడి సత్తయ్య, బొక్క సత్యనారాయణ రెడ్డి, దేశం సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు చిలుకలు రఘునందన్, గౌర ప్రభాకర్, సురసాని భూమి రెడ్డి, కళ్లెం సుధాకర్ రెడ్డి, కళ్లెం చెన్నారెడ్డి, ఇంద్రకంటి రవీందర్ గౌడ్, నరసింహ, పాండు, పెండ్యాల భాస్కర్, శ్రీరాములు, అనిల్, రామకృష్ణ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



