గ్రాడ్యువేట్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రోజు హాలీ డే

గ్రాడ్యువేట్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రోజు హాలీ డే

తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న సెలవు ప్రకటించింది. 27న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉండటంతో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ పర్సెంట్ పెంచే ఉద్ద్యేశ్యంతో ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 27న జరగనుంది. 

 

Read More సంకల్పానికి సహకారం అయాన్ శిక్షణ సంస్థ - చైర్మన్ అయాన్ గ్రూప్ ఫైవ్ జాబ్స్ అచీవర్ పిసి & స్టేట్ టాపర్, ఆక్టోపస్ మాజీ కమాండో ఎండి. అన్వర్

ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని ఈసీ భావిస్తోంది. పైగా.. గ్రాడ్యుయేట్లే ఓటింగ్‌కు రాకపోతే.. మామూలు ఎన్నికల్లో సామాన్య ప్రజలకు అసలు పోలింగ్ బూత్‌ల దగ్గరకే రారు. విద్యావంతుల నుంచే మార్పు మొదలు కావాలని ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకే అందుకూ ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంతో నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట్ జిల్లాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సెలవు ప్రకటించింది. 

 

అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే సెలవు వర్తిస్తోంది. ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ సెలవు వర్తించదని చెప్పింది. కానీ.. ఓటు వేసేందుకు వీలుగా ఓటర్లకు పర్మిషన్ ఇవ్వాలని ప్రైవేటు కంపెనీలకు సూచించింది. ఇక ఉప ఎన్నికను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో ప్రచారం చేశాయి. అటు.. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో ఈసీ ఎన్నికకు సర్వం సిద్దం చేస్తోంది.