అవసరమైతే తప్ప బయటకు రావద్దు.. హెచ్చరించిన జిహెచ్ఎంసి
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు తెలంగాణ ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే జిహెచ్ఎంసి అధికారుల సహాయం కోసం 040-21111111 లేదా 9000113667 కి ఫోన్ చేయాలని వెల్లడించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలెవరు బయటకు రాకూడదని తెలిపారు.
ఇలా పలు రాష్ట్రాలలో కుండపోతగా కురుస్తున్నటువంటి ఈ వానలు మరో ఐదు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కావడంతో వీలైనంతవరకు బహిరంగ ప్రదేశాలను తిరగకపోవడమే మంచిదనీ అధికారుల సూచిస్తున్నారు.