సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసూన ఆగ్రహం

సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసూన ఆగ్రహం

సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లోగో మార్పును ఆమె తప్పుబట్టారు. రేవంత్ చిత్రకారుడు అనుకున్నానే కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యమున్న నాయకుడని అనుకోలేదని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లోగో మార్పును ఆమె తప్పుబట్టారు. రేవంత్ చిత్రకారుడు అనుకున్నానే కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యమున్న నాయకుడని అనుకోలేదని ఎద్దేవా చేశారు. చరిత్రను మార్చివేసి రాబోయే తరాలకి విషం నింపబోతున్నారా? అని ప్రశ్నించారు. కాకతీయులు ఢిల్లీ రాజులను ఎదిరించి దేశంలోనే రాజకీయ చరిత్రను మార్చిన గొప్పవ్యక్తులని గుర్తు చేశారు.

అలాంటి చరిత్ర కలిగిన వ్యక్తి, శిల్ప కళ కలిగిన వ్యక్తులు కాకతీయులను ప్రసూన చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమానికి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. కాకతీయ కళా తోరణాన్ని తీసివేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. సమ్మక్క, సారక్కలను చంపింది కాకతీయులు అని ములుగు సామ్రాజ్యం గురించి మాట్లాడేలా చేస్తున్నారని మండిపడ్డారు.

Read More సాయిబాబా మందిరానికి సామాజిక సేవకులు భాస్కర్ గౌడ్ విరాళం 

కమ్మ వారు లేకపోతే ములుగు ఉందా? అని ప్రశ్నించారు. గణపతి దేవుడు కమ్మ వ్యక్తి అని, యాదవ కులస్తూరాలిని పెళ్ళాడి రెండు కులాల మధ్య బంధం పెంచారని చరిత్రకు వన్నె తెచ్చరాని తెలిపారు. అలాంటి కాకతీయ చరిత్రను వక్రీకరిస్తారా? అని మండిపడ్డారు. ఈ మార్పు వెనుక చంద్రబాబు కడిగిన ముత్యం సీతక్క ఉన్నారని అర్థమవుతోందన్నారు. కాకతీయులు క్రూరులని రేవంత్ రెడ్డితో మాట్లాడించడం సమంజసం కాదన్నారు. ములుగులో ఒక కమ్మ అభ్యర్థిగా తాను నిలబడతానని దమ్ముంటే సీతక్క తనపై గెలుపొందగలరా? అంటూ బహిరంగ సవాల్ చేశారు.