చలివేంద్రం ఏర్పాటు

చలివేంద్రం ఏర్పాటు

విశ్వంభర,  బోడుప్పల్: మేడ్చల్ మల్కాజిగిరి కార్పొరేషన్ ఆకృతి టౌన్షిప్ సమీపంలో స్టార్ ఫౌండేషన్ ఫౌండర్ జువేద్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోడుప్పల్ మాజీ మేయర్ తోటకు రాజ యాదవ్, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ హాజరై చలివేంద్రానికి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత ప్రజాసేవకై ముందుకు రావాలని, ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు తోడ్పాటుగా మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన జువేద్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టార్ ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: