ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ పర్యవేక్షించిన ఎమ్మెల్యే మురళి నాయక్

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం ఉమ్మడి మాధవపురం గ్రామంలో సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ఎమ్మెల్యే మురళి నాయక్ స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా పారదర్శకంగా ఎన్యూమరేషన్ నిర్వహిస్తున్నామని, ప్రతి అర్హుడు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి వివక్ష లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవరం ప్రకాష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టకంటి రాంరెడ్డి, సర్పంచ్ వేంపటి రమేష్, ఉపసర్పంచ్ మద్ది వెంకట్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-murali-naik-supervised-the-enumeration-from-house-to-house/article-17866

Tags: