107 మొబైల్ ఫోన్ల అప్పగింత
విశ్వంభర,సూర్యాపేట: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ. 22 లక్షల విలువ గల 107 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి.. జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....''ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది. దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థిక పరమైన అంశాలకు వినియోగిస్తున్నాం. మన విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నాము . మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోతున్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారు. ఇతర రాష్ట్రాలు బీహార్, ఒరిసా, జార్ఖండ్ ఇలా ఇతర రాష్ట్రాల వారి నుండి ఈ మొబైల్స్ ను రికవరీ చేశారు. ప్రజల ఆస్తుల రక్షణలో అనుక్షణం ప్రజల పక్షాన పోలీసు పని చేస్తుంది. తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు, నేరాలకు పాల్పడే వారికి ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు. సామాన్యుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలి. పోలీసు శాఖ కృత నిచ్చయంతో పని చేసి శనివారం పెద్దమొత్తంలో ఫోన్స్ రికవరీ చేసి భాదితులకు అందించాం'' అని ఎస్పీ అన్నారు.



