ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ పై చర్యలు తీసుకోవాలి
విశ్వంభర, హిమాయత్‌నగర్ : ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అక్రమ ఫీజుల దోపిడిని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాదు హిమాయత్‌నగర్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ జీవో నం.1ను పాటించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు పార్టీ ప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. తల్లిదండ్రుల కమిటీల ఏర్పాటు, నెలవారీ పేరెంట్స్ సమావేశాలు, ఫీజుల వివరాల ప్రదర్శన, వార్షిక ఆడిట్ నివేదికలు, ఫీజు వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం వంటి నిబంధనలను అనేక పాఠశాలలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. అధిక ఫీజులతో తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే గుర్తింపులు, అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పర్యవేక్షణ కోసం పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో: స్టేట్ జాయింట్ ట్రెజరర్ జావిద్ షరీఫ్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఉమారాణి ఉప్పల్ బీరప్పగడ్డ డివిజన్ ఇంచార్జ్ మల్లికార్జున్ పాల్గొన్నారు.