ఫాలోవర్ల కోసం ఫ్యాషనా? డబ్బు కోసం అసభ్యతా? సోషల్ మీడియా సబ్‌స్క్రిప్షన్ కల్చర్‌పై ఓ చర్చ

విశ్వంభర, డెస్క్ /హైదరాబాద్ :-  ఒకప్పుడు సినీ నటులు, టీవీ యాంకర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీలు తమ ప్రతిభతో అభిమానులను సంపాదించుకునేవారు. వారి నటన, కళ, వ్యక్తిత్వం, సామాజిక బాధ్యతే వారికి గుర్తింపు తెచ్చేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఇతర డిజిటల్ వేదికల్లో "సబ్‌స్క్రిప్షన్" పేరుతో కొందరు సెలబ్రిటీలు అనుసరిస్తున్న ధోరణి కొత్త చర్చకు దారితీస్తోంది.

నెలకు కొంత డబ్బు చెల్లిస్తే ప్రత్యేక ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత కంటెంట్ చూపిస్తామని చెబుతూ సబ్‌స్క్రిప్షన్ పథకాలు ప్రారంభిస్తున్నారు. కొందరు ఫాలోవర్లను ఆకర్షించడానికి మరింత రెచ్చగొట్టే, అసభ్యతకు దగ్గరగా ఉండే కంటెంట్‌ను అందిస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.

Read More మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.  

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు కేవలం నటులు లేదా యాంకర్లు మాత్రమే కాదు. వారు ఒక బ్రాండ్‌గా మారిపోయారు. వారి ప్రతి పోస్ట్‌కు మార్కెట్ విలువ ఏర్పడింది. ఫాలోవర్లు పెరిగిన కొద్దీ ఆదాయం కూడా పెరుగుతోంది.

ఈ పోటీలో కొందరు తమ ప్రతిభ కంటే శరీర ప్రదర్శనను, వివాదాస్పద పోస్టులను, వ్యక్తిగత జీవితాన్ని అమ్ముకునే పరిస్థితికి చేరుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువ మంది సబ్ స్క్రైబర్లు రావాలంటే మరింత ఆకర్షణీయమైన కంటెంట్ చూపించాలనే ఒత్తిడి పెరుగుతోంది.

దీంతో వీరి కన్ను యువత పై పడింది. సబ్ స్క్రైబ్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది యువత ఉండటమే దీనికి నిదర్శనం.. సెలబ్రిటీలను ఆదర్శంగా భావించే యువకులు, యువతులు విజయానికి ప్రతిభ కంటే శరీర ప్రదర్శన, సంచలనమే మార్గమని భావించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సామాజిక మాధ్యమాలు సృజనాత్మకతకు వేదిక కావాల్సిన చోట, కేవలం వీక్షణలు డబ్బు కోసం విలువలను పక్కన పెట్టే ధోరణి పెరగడం ఆందోళన కలిగించే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు.

ఈ పరిస్థితికి కేవలం సెలబ్రిటీలనే బాధ్యుల్ని చేయలేం. వీక్షణల కోసం ఎదురు చూసే ప్రేక్షకులది కూడా కొంత బాధ్యత ఉంది. డిమాండ్ ఉన్న చోటే సరఫరా ఉంటుంది. అసభ్యకరమైన లేదా సంచలనాత్మక కంటెంట్‌కు లక్షలాది మంది స్పందిస్తే, మరింత మంది అదే దారిలో నడవడం సహజం. అలాగే సోషల్ మీడియా వేదికలు కూడా తమ కమ్యూనిటీ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రతి వ్యక్తికీ తన ఇష్టానుసారం కంటెంట్ రూపొందించే స్వేచ్ఛ ఉంది. కానీ ప్రజాదరణ పొందిన వ్యక్తులు సమాజంపై తమ ప్రభావాన్ని గుర్తించాలి. స్వేచ్ఛ పేరుతో ఏదైనా చేయవచ్చనే భావన సరైంది కాదు. ముఖ్యంగా లక్షలాది మంది యువతను ప్రభావితం చేసే వ్యక్తులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-discussion-on-vulgar-social-media-subscription-culture-for-fashion/article-17832

Tags: