దబాంగ్ ఏంటిరా బాబు.. తెలంగాణలో కొత్త బీర్లపై ట్రోల్స్ 

దబాంగ్ ఏంటిరా బాబు.. తెలంగాణలో కొత్త బీర్లపై ట్రోల్స్ 

ఇటీవల తెలంగాణలో కొత్త రకం బీర్లు గురించి వార్తలు హెడ్‌లైన్స్‌గా నిలుస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఇదే వార్త హైలెట్ అవుతోంది. గత కొంత కాలంగా తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఏర్పడింది. దీంతో.. రేవంత్ రెడ్డి సర్కార్ కింగ్ ఫిషర్ ప్లేసులో సోమ్ డిస్టిలరీస్ కు అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు మరో మూడు కొత్త బీర్లు తెలంగాణలోకి రానున్నాయి. సోమ్ డిస్టలరీస్ తో పాటు మరో మూడు డిస్టలరీస్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 

Read More కస్తూర్బా గాంధీ  పాఠశాల/కళాశాల  తనిఖీ చేసిన:సబితా ఇంద్రారెడ్డి  

టాయిల్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జొటికా కంపెనీలకు అనుమతులు లభించాయి. అయితే.. ఈ కంపెనీల పేర్లు కొంత విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఒకదాని పేరు, దబాంగ్, మరో దాని పేరు లేమౌంట్ పేర్లు అని తెలుస్తోంది. అయితే.. ఈ పేర్లను నెటిజన్లు బాగా వైరల్ చేస్తున్నారు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దబాంగ్ ఏంటీ.. గబ్బర్ సింగ్ అయితే బాగుంటుంది కదా అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. కొత్త కంపెనీల బీర్లు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వక ముందే మంచి పాపులారిటీ వచ్చేసింది.