తెలంగాణ అమరుడు ఉద్యమ జ్యోతి కాసోజు శ్రీకాంతా చారి - తెలంగాణ ఉద్యమకారుడు - డా కాచం

శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా డా. కాచం ఘన నివాళులు

తెలంగాణ అమరుడు ఉద్యమ జ్యోతి కాసోజు శ్రీకాంతా చారి - తెలంగాణ ఉద్యమకారుడు - డా కాచం

ప్రజా విశ్వంభర, హైద్రాబాద్ ;- తెలంగాణ ఉద్యమకారుడు , అమరుడు కాసోజు శ్రీకాంతా చారి జయంతి సందర్బంగా తెలంగాణ ఉద్యమకారుడు , విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి డా . కాచం సత్యనారాయణ ఎల్బీనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డా. కాచం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలి దశ ఉద్యమానికి తీవ్ర రూపం దాల్చి నాంది పలికిన గడ్డ ఎల్బీనగర్ గడ్డ అని అన్నారు .ఈ  గడ్డ నుండి తెలంగాణ  స్వరాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేశామని అన్నారు. నాటి ఉద్యమ ప్రస్థానం గుర్తు చేసుకుంటూ నేడు తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఉన్నామంటే అది కేవలం కాసోజు శ్రీకాంతా చారి బలిదానమే అలాంటి మహనీయడు ఆత్మార్పణ , ఎంతో మంది అమరుల ప్రాణ త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మాణం చేసుకున్నామని అన్నారు. కాసోజు శ్రీకాంతా చారి నాతో కలిసి ఎల్బీనగర్ లో ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో అప్పటి ఆంధ్రుల అరాచకాల నడుమ నిరసనలు , ఆందోళనలు చేస్తున్న తరుణంలో  కోపోద్రిక్తుడు అయిన కాసోజు శ్రీకాంతా చారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకొని ప్రాణ త్యాగానికి పాల్పడ్డ ఘటన ఇంకా నా కండ్ల ముందు కదలాడుతుందని అన్నారు. ఈ జయంతి సందర్బంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ కాసోజు శ్రీకాంతా చారి అమర్ రహే , జై తెలంగాణ  అంటూ నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో  కాసం సాయి ,  ఇరుగు శ్రీధర్ , బి ఆర్ అరుణ్ అంబెడ్కర్ మాదిగ , అన్వర్, కార్తిక్  , బోయపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

Tags: