రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని  తనిఖీ చేసిన డిప్యూటీ కలెక్టర్

విశ్వంభర, రామన్నపేట:  యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కృతిక శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అభా హాజరులో అందరూ తమ హాజరును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆమె వైద్యులను, సిబ్బందిని కోరారు. అనంతరం వార్డులలో, ఓపి విభాగంలో తిరిగి రోగులతో మాట్లాడి  వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవనం శిథిల దశకు చేరుకుందని వర్షం వస్తే రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పెచ్చులు ఊడి మీద పడుతున్నాయని, జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని, నూతన భవనంను ఏర్పాటు చేయాలని స్థానికులు ఆమెను కోరారు. సమస్యలను  అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఆమె వెంట వైద్యులు అలివేలు, శ్వేత ప్రియాంక, స్వాతి బాయి, నవీన్ సింగ్, మాధవాచారి, సపోర్టింగ్ ఇంజనీర్ శోభన, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/deputy-collector-inspected-the-ramannapet-government-hospital/article-17862

Tags: