సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్పో పోటీలకు రాష్ట్ర వాటర్ పోలో జట్టు
విశ్వంభర, బషీర్ బాగ్ : తెలంగాణ రాష్ట్ర సీనియర్ వాటర్ పోలో జట్టు సీనియర్ నేషనల్స్ పోటీలకు సిద్ధమైంది. తెలంగాణ వాటర్ పోలో టీం 2026 జులై 7 నుంచి జులై 12 వరకు చెన్నై కట్ట న్ కుళత్తూర్ డాక్టర్ టి. పారివేందర్ ఆక్వాటిక్ కాంప్లెక్స్ లో నిర్వహించనున్న 79వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర వాటర్ పోలో జట్టుకు, మేనేజర్ అండ్ కోచ్ లకు శుక్రవారం గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియంలో యూనిఫామ్, టీషీర్ట్స్ కిట్ అందించారు. ఈ ఈవెంట్ కిట్ ని 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ స్పాన్సర్ చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ నేషనల్స్ వాటర్ పోలో టీమ్ , స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి . చంద్ర శేఖర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి జి . ఉమేష్ , 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఎండీ ఎల్. ఎం శంకర్ , టీం మేనేజర్ టి కిరణ్ కుమార్ , ఐ బాల మల్లేశ్వర్, వాటర్ పోలో కోచ్ తిరుపతి , ఆయుష్ యాదవ్, బాలాజీ పాల్గొన్నారు. సీనియర్ నేషనల్స్ వాటర్ పోలో జట్టు ఎంపిక ట్రయల్స్ అంబర్‌పేట్ లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన 11వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో నిర్వహించారు.