రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఇకపై వాటిని పొందవచ్చు? 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఇకపై వాటిని పొందవచ్చు? 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపారు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు పరిచే విధానంపై అలాగే రాష్ట్ర సుపరిపాలనపై దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తుంది. అయితే తాజాగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. 

 

Read More అందెల శ్రీరాములు యాదవ్ ను కలిసిన ఫోర్త్ సిటీ భూ బాధిత రైతులు

సాధారణంగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారందరూ కూడా రేషన్ కార్డును కలిగి ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ రేషన్ కార్డు ద్వారా ఇప్పటికే మనం ప్రభుత్వ దుకాణం నుంచి బియ్యం, చక్కెర, గోధుమలు వంటి వాటిని సబ్సిడీ కింద తక్కువ ధరలో పొందుతున్నారు. అయితే ఇకపై మరికొన్ని వస్తువులను అదనంగా సబ్సిడీ కింద తక్కువ ధరకే తీసుకొని అవకాశాన్ని కల్పించారు. 

 

Read More అందెల శ్రీరాములు యాదవ్ ను కలిసిన ఫోర్త్ సిటీ భూ బాధిత రైతులు

ప్రస్తుతం బియ్యంతో పాటు చక్కెర మరికొన్ని ప్రాంతాలలో గోధుమలను తక్కువ ధరలకి కొనుగోలు చేస్తున్నారు. ఇవే కాకుండా మరికొన్ని సరుకులను కూడా అదనంగా సబ్సిడీ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఏ ఏ వస్తువులను రేషన్ కార్డు ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు అనే విషయాలను త్వరలోనే తెలియజేయనున్నారు.