ప్రభుత్వ విప్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

ప్రభుత్వ విప్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా నియమితులైన సందర్భంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు పూస బాలకిషన్ ఆధ్వర్యంలో ఇంద్రపాలనగరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యేను నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.

Tags: