ఘనంగా కేంబ్రిడ్జ్ స్కూల్ స్పోర్ట్స్ డే వార్షికోత్సవం
విశ్వంభర, హైదరాబాద్ : అంబర్పేట మున్సిపల్ మైదానంలో శనివారం ఉదయం గోల్నాక లోని కేంబ్రిడ్జ్ స్కూల్ స్పోర్ట్స్ డే వార్షికోత్సవం ను ఘనంగా నిర్వహించారు. స్కూల్ నిర్వాహకుడు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిప్యూటీ చైర్మన్ మహమ్మద్ యాసిన్ షరీఫ్
అతిధులను ఆహ్వానించాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు హాజరై స్వర్గీయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించి స్పోర్ట్స్ డే జెండా ఆవిష్కరణ చేసి స్పోర్ట్స్ డేని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులు చదువులతోపాటు ఆటలలో రాణించాలని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అవకాశాలను కల్పిస్తుందని ఆదిశగా విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకెళ్లాలని అన్నాడు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల ఆటల పోటీలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు మన్మోహన్ సింగ్ వేషధారణతో కూడిన చిన్నారుల లగునాటికలు నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నయి. ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ యాదవ్ ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్ ఆనంద్ గౌడ్ శ్రీమంత్ గిరి తదితరులు పాల్గొన్నారు. అతిథులను కేంబ్రిడ్జ్ స్కూల్ నిర్వాహకుడు మహమ్మద్ యాసిన్ షరీఫ్, స్కూల్ ప్రిన్సిపాల్ సయ్యద్ అబదుల్ల సత్కరించారు.వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసి మన్మోహన్ సింగ్ వేషధారణలో ఉన్నటువంటి విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ
కార్యక్రమంలో స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ అసిమా అంతుల్ల కోఆర్డినేటర్ మోహిన్ అహ్మద్ షేక్ అబూ బాకర్ తదితరులు విద్యార్థులను కోఆర్డినేట్ చేశారు.



