BREAKING: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల..!

BREAKING: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల..!

 ఈసెట్ ఫలితాలు ఇవాళ(ఆదివారం) తెలంగాణ ఈసెట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. ఈ సెట్ లో 95.86 శాతం క్వాలిఫై అయినట్లు తెలిపారు.

పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాది ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలు ఇవాళ(ఆదివారం) విడుదలయ్యాయి. తెలంగాణ ఈసెట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. మే 6న ఈసెట్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 99 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. 

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈసెట్‌ పరీక్షను నిర్వహించారు.  ఈ https://ecet.tsche.ac.in/ లింక్‌లో ఈసెట్‌ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ సెట్ లో 95.86 శాతం క్వాలిఫై అయినట్లు ప్రొఫెసర్ లింబాద్రి వివరించారు. 282 కాలేజీల్లో అడ్మిషన్స్ కు అవకాశం ఉందని తెలిపారు. కన్వీనర్ కోటలో10 వేల 834 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మొత్తం 25 వేల 230 పైగా సీట్లు ఉన్నాయని, జూన్ రెండో వారంలో అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందని వివరించారు.

Read More జోగులాంబకు బోనం పట్టు వస్త్రాలు సమర్పణ 

https://ecet.tsche.ac.in/TSECET/TSECET_RankCard_2024_GET.aspx