ఘనంగా ఎమ్మెల్యే బాలు నాయక్ జన్మదిన వేడుకలు
పెద్ద ఎత్తున రక్త దానం చేసిన నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు
చింతపల్లి , విశ్వంభర :- నల్లగొండ జిల్లా దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. చింతపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మేల్యే కోసి తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎమ్మెల్యే బాలునాయక్ పై తమ అభిమానం చాటుకున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు మరోసారి నిరూపించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మెల్యే అభిమానులు సుమారు 60 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కొండూరి భవాని పవన్ కుమార్, సంజీవ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, వైస్ఎంపీపీ యాది గౌడ్, మాజీ సర్పంచ్ ముచ్చర్ల గిరి, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, అంగరేకుల గోవర్ధన్, ఎరుకల వెంకటయ్య గౌడ్, కొండల్, శ్రీనివాస్ రెడ్డి, మాజి ZPTC లు హరి నాయక్, రవి నాయక్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.