ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం
25 జూలై 2024 విశ్వంభర మెట్పల్లి : - మెట్పల్లి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ అధ్యక్షతన బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ చిట్నేని రాఘవేంద్రరావు గారు రావడం జరిగింది రఘుఅన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే,ఎంపీ ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు అన్ని విధాలుగా అండగా ఉండి వారిని కౌన్సిలర్ గా గెలిపించుకుంటామని మున్సిపల్ చైర్మన్ బిజెపి కైవసం చేసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి రైతులకు చిరువ్యాపారులకు సంతోషాన్ని కలిగించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో నామమాత్రంగా ఒకటి రెండు పథకాలను నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరుగ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని కోరడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తుందని వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి బాబు జిల్లా అధికార ప్రతినిధి వడ్డేపల్లి శ్రీనివాసు. స్టేట్ కౌన్సిల్ మెoబర్ ఏలేటి నరేందర్ రెడ్డి .బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్ .బిజెపి కౌన్సిలర్ మర్రి పోచయ్య. బీజేవైఎం పట్టణ కన్వీనర్ సుంకేట విజయ్ .మద్దెల లావణ్య .పుల్ల సౌజన్య. నూనె క్రాంతి .దేవ రాజ్యం.కలాలి రాజిరెడ్డి. తోకల సత్యనారాయణ. బోడ్ల ఆనంద్. తిరుమల్ .భీమనాతి విజయ్. రూపేష్ .తోట ప్రసాద్. ఆనంద్. కృష్ణమూర్తి .దత్తు.ఉమేష్.రాకేష్ మారుతి. వివేక్ మారుతి అనిల్. మల్లేష్ కుమార్ .శీను.బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇంచార్జిలు పట్టణ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.