క్షేత్ర పర్యటనతో స్టూడెంట్స్ కు అవగాహన..

క్షేత్ర పర్యటనతో స్టూడెంట్స్ కు అవగాహన..

  • మెడికల్ ఆఫీసర్ సురేష్..
  • పిహెచ్సిని సందర్శించిన మోడల్ విద్యార్థులు.

విశ్వంభర, ఇనుగుర్తి: క్షేత్ర పర్యటనలతో విద్యార్థులకు ఆయా విషయాలపై అవగాహన పెంపొందుతుందని మండల మెడికలాఫీసర్ డా. సురేష్ అన్నారు. కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ స్టూడెంట్స్ ప్రిన్సిపాల్ నవీన్ ఆదేశాల మేరకు హెల్త్ కేర్ ప్రవళిక ఆధ్వర్యంలో  క్షేత్ర పర్యటన కోసం ఇనుగుర్తి పిహెచ్సి ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి విద్యార్థులకు పలు విషయాల పట్ల అవగాహన కల్పించారు. అంతకు మునుపు విద్యార్థులు ఆసుపత్రిలో పలు విభాగాలను చూసి వాటి గురించి వైద్య ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఎఎన్ఎం కవిత టెటనస్ ధనుర్వాతం గురించి విద్యార్థులకు విషదపరిచారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది హరిత, సంధ్య ఉపాధ్యాయులు ప్రవళిక సురేందర్ పాల్గొన్నారు.

Tags:  

Advertisement