విలువలకు జీవం పోసిన మహామనిషి అంబేద్కర్
On
విశ్వంభర, హనుమకొండ: వరంగల్ జిల్లా లో ఎన్.ఎస్.ఆర్. పాఠశాలలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఓదెల చంద్రమౌళి మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో సమానత్వం, న్యాయం, మానవత్వం అనే విలువలకు జీవం పోసిన మహామనిషి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. ఆయన జీవితం ఒక సాధారణ వ్యక్తి ఎలా మహోన్నతుడిగా ఎదిగి సమాజ మార్పుకు దీపస్తంభంగా నిలవగలడో చూపిన గొప్ప ఉదాహరణ అని అన్నారు. అణగారిన వర్గాలకు గౌరవప్రదమైన జీవితం కల్పించేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.



