చండూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భరోసా

 చండూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భరోసా

 రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెల వేతనాలు అందేలా ప్రయత్నం చేస్తా.. 

చండూర్, విశ్వంభర :-నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో గత కొంతకాలంగా వేతనాలు సరిగ్గా అందడం లేదని జులై  1 నుండి  చండూరు మున్సిపాలిటీలో  పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలు చేపట్టడం జరిగింది. నెలనెల వేతనాలు రావడం లేదని పారిశుద్ధ్య కార్మికులు గత కొన్ని నెలలుగా  ఇబ్బందులు పడుతున్నామని  ఆవేదన వ్యక్తం చేస్తూ దీక్ష చేపట్టారు .స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే . నియోజకవర్గ పర్యటనలలో భాగంగా  గురువారం నాడు  ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనకు  గల కారణాలు తెలుసుకోవటానికి   చండూర్ మున్సిపాలిటీలోని  అతిధి గృహంలో పారిశుద్ధ్య కార్మికులను కలిసి వారి సమస్యల పై ఆరా తీశారు.  పారిశుద్ధ కార్మికుల వేతనాల విషయంలో చండూరు మున్సిపల్ కమిషనర్, అధికారులతో చర్చించి మున్సిపాలిటీలో వనరులను సమాకుర్చుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ  కార్మికులకు ప్రతి నెలా వేతనాలు వచ్చే విధంగా  రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉండి వారికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి నెల జీతభత్యాలు సమయానికి  అందించే దిశగా చర్యలు చేపడుతామని అన్నారు.ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో పారిశుద్ధ్య కార్మికులు దీక్ష విరమింపజేశారు.వేతనాలపై భరోసా కల్పించడంతో పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దోటి వెంకటేష్ ,అనంత చంద్ర శేఖర్ , మంచుకొండ సంజయ్ , కోడి గిరిబాబు ,పల్లె వెంకన్న ,పున్న ధర్మేందర్ ,కారింగు రామ్మూర్తి ,  భూతరాజు వేణు , మల్లేశం , జనార్దన్ , కాంగ్రెస్ నాయకులు ,  కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు 

 

Read More ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత.. 

 

Read More ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత.. 

 

Read More ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత.. 

Tags: