రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన గాంధీజీ విద్యార్థులు
అభినందించిన ఎస్సై వెంకన్న గౌడ్
- జిల్లా స్థాయి కరాటే పోటీలలో సత్తా చాటిన గాంధీజీ విద్యార్థులు
- రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన గాంధీజీ విద్యార్థులను అభినందించిన ఎస్సై వెంకన్న గౌడ్
విశ్వంభర, చండూర్ :- నల్లగొండ ఇండోర్ స్టేడియంలో 69వ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్ జి ఎఫ్ అండర్ -14, అండర్ -17 బాల బాలికల కరాటే పోటీలలో స్థానిక గాంధీజీ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ కరాటే పోటీలకు ఎంపికైన సందర్భంగా గాంధీజీ విద్యాసంస్థలలో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో స్థానిక ఎస్సై వెంకన్న గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పాల్గొని విద్యార్థులను శాలువాలు, మెమొంటోలతో సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం విద్యార్థులు ముఖ్యంగా బాలికలు కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం చాలా అవసరం అన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ విద్యార్థులు ప్రతిభ చూపి, జాతీయ స్థాయికి వెళ్లి విజయం సాధించి చదివిన పాఠశాలకు, పుట్టిన ఊరుకు, కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశించారు. సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత, మహిళల భద్రతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన వారిలో ఎం. శ్రీనిధి (అండర్ -17), గోపీలత (అండర్-17) ఎం చక్రధర్ (అండర్-14)లు,అదేవిధంగా సిల్వర్ మెడల్ సాధించిన టి.అన్నవరం (అండర్-17) సి.హెచ్. విష్ణు (అండర్-17) పి.సహస్ర (అండర్-14) లు సన్మానం పొందిన వారిలో ఉన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, కరాటే కోచ్ శ్రీధర్ సాగర్,ప్రిన్సిపల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, పిఈటి సాయిరాం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



