టీ20 ప్రపంచకప్ ఆరంభం.. అమెరికాతో కెనడా ఢీ!

టీ20 ప్రపంచకప్ ఆరంభం.. అమెరికాతో కెనడా ఢీ!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి.

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో అమెరికాతో కెనడా ఢీకొడుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఆదివారం (జూన్ 2) ఉదయం 6గంటలకు ఆరంభం అయింది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. కెనడా 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137రన్స్ చేసింది.

2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగంగా ఉండటంతో ఈ ప్రపంచకప్ ద్వారా అక్కడి అభిమానులను ఆకర్షించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. 20 జట్లను 5 టీమ్స్ చొప్పున 4 గ్రూప్లుగా విభజించారు. ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో పోటీకి దిగుతాయి. టాప్-2లో నిలిచిన రెండు టీమ్‌లు సూపర్ ఎయిట్‌కు చేరుకుంటాయి. సూపర్ ఎయిట్‌లో ఎనిమిది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విడదీస్తారు. ఒక్కో టీమ్ మిగిలిన మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. 

ఒక్కో గ్రూప్ నుంచి టాప్- 2లో నిలిచిన రెండు టీమ్‌లు సెమీస్ ఆడుతాయి. చివరగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వెస్టిండీస్‌తో ఆరు, అమెరికాలలో మూడు వేదికలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, క్రికెట్'కు అంతగా ప్రాధాన్యం లేని అమెరికా వెస్టిండీస్‌తో కలిసి టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యస్తోంది. వెస్టిండీస్‌తో 2010లో మెగా పోరు జరిగింది. క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరింపజేయడంలో భాగంగా ఐసీసీ తొలిసారి 20 జట్లతో ప్రపంచకప్ నిర్వహిస్తోంది. ర్యాంకింగ్, ఆతిథ్య జట్టు హోదాలో టీమ్‌లు ముందుగా అర్హత సాధించగా క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా మరిన్ని జట్లు బరిలో నిలిచాయి.

Related Posts