ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
టీ20 ప్రపంచ కప్ 2024లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆదివారం రాత్రి 8గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రారంభమైంది ఈ మ్యాచ్.
టీ20 ప్రపంచ కప్ 2024లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆదివారం రాత్రి 8గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రారంభమైంది ఈ మ్యాచ్. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పాక్ జట్టు.
అయితే సూపర్ ఓవర్‌లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. పాక్ బౌలర్లు రాణించడంతో భారత్ టోర్నీ ముగిసేసరికి 19ఓవర్లలో 119 పరుగులు చేశారు. 120 పరుగుల లక్ష్యాన్ని పాక్ జట్టు ముందు ఉంచారు. భారత్ జట్టులో కోహ్లీ(4), సూర్య(7), దూబే(3), హార్దిక్(7), జడేజా(0) నిరాశపరిచారు. నసీమ్ షా, హారిస్ రౌఫ్ చెరో మూడు వికెట్లు, అమీర్ 2, షాహీన్ అఫ్రీదీ ఒక వికెట్ తీశారు. ఆ తర్వాత పాక్ జట్టు 120పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. అయితే, టీమిండియా బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా నిష్క్రమించారు. 113/7 స్కోరుకే పరిమితమైంది పాక్.
ముఖ్యంగా స్టార్ బౌలర్ బుమ్రా పాక్‌కు కీలకమైన 3 వికెట్లు తీసి భారత్‌ను విజయతీరాలకు తీసుకెళ్లాడు. 19వ ఓవర్‌లో బుమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఇఫ్తికార్ వికెట్ తీశాడు. పాండ్యా 2, అక్షర్, హర్షదీప్ చెరో వికెట్ తీశారు. పాక్ బ్యాటర్లలో రిజ్వాన్(31), బాబర్ (13), ఉస్మాన్ (13), ఫఖర్ (13), ఇమాద్(15) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు ప్రపంచ కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచుల్లో భారత్ (7సార్లు) అత్యధికంగా గెలిచిన జట్టుగా నిలిచింది.