ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలుపు 

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలుపు 

డ‌ల్లాస్ వేదిక‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ మ్యాచ్‌లో శ్రీలంక‌కు ఘెర ప‌రాభ‌వం ఎదురైంది. ఆ జ‌ట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిని చవిచూసింది.

డ‌ల్లాస్ వేదిక‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ మ్యాచ్‌లో శ్రీలంక‌కు ఘెర ప‌రాభ‌వం ఎదురైంది. ఆ జ‌ట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిని చవిచూసింది. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 124 ప‌రుగులకు మాత్రమే పరిమితమైంది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ నిస్సాంక 47 ర‌న్స్‌తో రాణించ‌గా, ధ‌నుంజ‌య 21, డిసిల్వా 19 ప‌రుగుల‌తో రాణించారు. బంగ్లాదేశ్ విజ‌యంలో హృదోయ్ (40), లిట‌ర్ దాస్ (36) కీల‌కంగా వ్యవహరించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో నువాన్ తుషార 4, హస‌రంగ 2 వికెట్లు పడగొట్టారు. 

ఇక ఈ ఓట‌మితో శ్రీలంక సూప‌ర్‌-8 అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్ప‌టికే త‌న తొలి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయింది. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ ప‌రాజ‌యంతో ఈ టీ20లో శ్రీలంకకు ఇది రెండో ఓటమి. బ్యాట‌ర్లు విఫలమవడంతో బంగ్లాదేశ్‌ విజృంభించింది. బంగ్లా బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్‌, రిష‌ద్ హుస్సేన్ చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్టి లంక బ్యాట‌ర్ల‌కు చెమటలు పట్టించారు. అనంత‌రం 125 ప‌రుగుల స్వ‌ల్ప ఛేద‌న‌తో బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్ 19ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేరుకుంది.

Related Posts