యాసిడ్ దాడి ఘటన పూర్తిగా అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన వీసీ!
ఇటీవల ఇక్పాయ్ యూనివర్సిటీ వేడుకలలో భాగంగా అపశృతి చోటు చేసుకుంది. రంగు నీళ్లు అనుకొని లేఖ అనే విద్యార్థినిపై దాడి చేయడంతో తీవ్రగాయాలు పాలయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై యూనివర్సిటీ వీసీ స్పందించారు. ఈ సందర్భంగా వీసీ గణేష్ మాట్లాడుతూ.. యాసిడ్ దాడి వల్ల ప్రమాదం జరగలేదని తెలిపారు.
వేడి నీటి కారణంగా ఆమె శరీరంపై బొబ్బలు వచ్చాయని అయితే యూనివర్సిటీ వసతి గృహంలోని తనకు ప్రాథమిక చికిత్స చేసి అనంతరం ఆసుపత్రికి తరలించినట్లు ఈయన వెల్లడించారు. ఈనెల 15వ తేదీ ఈ ఘటన జరిగిందని తెలిపారు. బుధవారం రాత్రి 7:20 గంటల సమయంలో రూమ్ నుంచి బయటకు వచ్చి తన శరీరంపై బొబ్బలు వచ్చాయని చెప్పడంతో ఆమెకు వెంటనే మా క్లినిక్ లో చికిత్స అందించామని తెలిపారు.
తన శరీరం పై దాదాపు 40% గాయాలు ఉన్నాయని అయితే గతంలో తనకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. ఇక ఆ విద్యార్థి ఉన్నటువంటి హాస్టల్ కారిడార్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లను కూడా తాము పోలీసులకు అందజేశామని తెలిపారు. ఇక అక్కడ గదులను శుభ్రం చేసే వారు కూడా హాస్టల్లో అమ్మాయిలు ఉన్నప్పుడే వెళ్తారని వీసీ గణేష్ ఈ ఘటనపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.