కేంద్రమంత్రిపై మనసు పారేసుకున్న నటి.. ప్రేమిస్తున్నానంటూ పోస్టు

కేంద్రమంత్రిపై మనసు పారేసుకున్న నటి.. ప్రేమిస్తున్నానంటూ పోస్టు

 

ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ పేరు బాగా వైరల్ అవుతోంది. అటు సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన పేరే హైలెట్ అవుతోంది. ఎందుకంటే చార్మింగ్ గా, స్టైలిష్‌ గా ఉండే ఆయనపై యువతులు మనసు పారేసుకుంటున్నారు. ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఇక ఈ లిస్టులో తాజాగా భోజ్ పురి నటి నిషా దూబే చేరిపోయారు. ఆమె ఏకంగా కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ ను ప్రేమిస్తున్నానంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది. దాంతో అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నిషా దూబే వయస్సు 25 ఏండ్లయితే, చిరాగ్ పాశ్వాన్‌కు 45 యేండ్లు. అంత పెద్ద వయసు వ్యక్తిపై మనసు పారేసుకోవడం ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర మంత్రిగా చిరాగ్ పాశ్వాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియో క్లిప్ ను ఆమె ఇన్ స్టాలో పోస్టు చేస్తూ.. నిత్యం నవ్వుతూ ఉండే ఆయన ముఖాన్ని చూస్తే ఎవ్వరైనా మనసు పారేసుకుంటారని.. నేను కూడా మనసు పడ్డానని తెలిపింది. అయితే ఆమె వ్యాఖ్యలపై నవాజ్ సిద్దిఖి స్పందిస్తూ.. ‘ఒక మహిళ ఏమైనా కోరుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు.

Related Posts