ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్

ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్

తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పొలింగ్ స్టేషన్ల దగ్గర ఇప్పుడిప్పుడే రద్దీ పెరుగుతోంది. ప్రతీ ఒక్కరు ఓటు వేసేందుకు ప్రభుత్వ సంస్థలకు ఈసీ సెలవు కూడా ప్రకటించింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్లు ఓటింగ్ లో పాల్గొననున్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  మొత్తం ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

Read More అవోప ఉపాధ్యక్షుడిగా వీర బొమ్మ రమేష్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో  భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తత తనిఖీలు చేపట్టారు. ఒక పోలింగ్ జరుగుతున్న జిల్లాల్లో  రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఈ ఎన్నిక ఫలితాలు జూన్ 5న రానున్నాయి. బీఆర్ఎస్ నేత పల్లారాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో.. ఉపఎన్నిక అనివార్యమైంద.  కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు.

IMG-20240527-WA0002

మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట గా ఓటు వేసిన జగదీష్ రెడ్డి.

యాదాద్రి...

తుర్కపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.