అరుణాచల్ సీఎంగా మూడోసారి పెమా ఖండూ ప్రమాణ స్వీకారం
అరుణాచల్‌ప్రదేశ్‌లో మరోసారి బీజేపీ సర్కార్ అధికారాన్ని చేపట్టింది. సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్ ఇవాళ (గురువారం) పెమా ఖండూతో ప్రమాణం చేయించారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లో మరోసారి బీజేపీ సర్కార్ అధికారాన్ని చేపట్టింది. సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్ ఇవాళ (గురువారం) పెమా ఖండూతో ప్రమాణం చేయించారు. ఈటానగర్‌లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. పెమా ఖండూ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. నేనషల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
వారిలో సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ కూడా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ దివంగత మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడే పెమా ఖండూ. దోర్జీ ఖండూ 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మరణం తర్వాత పెమా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. మొదట కాంగ్రెస్లో పని చేసిన పెమా ఖండూ నబమ్ తుకి కేబినెట్‌లో(కాంగ్రెస్)లో మంత్రిగా ఉన్నారు.