రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి మోడీ నివాళులు
నరేంద్ర మోదీ ఇవాళ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఇందుకు వేదికైంది. రాత్రి 7.15 గంటలకు మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు.
నరేంద్ర మోదీ ఇవాళ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఇందుకు వేదికైంది. రాత్రి 7.15 గంటలకు మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సందర్భంగా ఇవాళ(ఆదివారం) ఉదయం మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయికి మోడీ నివాళులర్పించారు. రాజ్‌ఘాట్, సదైవ్ అటల్‌కి వెళ్లి పుష్పాంజలి ఘటించారు.
రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పొరుగు దేశాల అధినేతలు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, ప్రమాణ స్వీకారం తర్వాత మోడీ నేరుగా వారణాసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ. pic.twitter.com/falQOcrShe
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2024